కొమ్మిక రహదారిని నిర్మించండి మహాప్రభో!
యూరియాతో వెళ్తున్న లారీ గుంతల్లో చిక్కుకున్న వైనం
నరకయాతన చూస్తున్న వాహనదారులు
RTVNEWS (లవకుశ)గుంతలు లేని రహదారులు నిర్మించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ప్రకటించడం తప్ప ఆచరణలో ఎక్కడ కానరావడం లేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో కొమ్మిక వెళ్లే రహదారి అనేక ఏళ్లుగా గుంతలు ఏర్పడి దర్శనమిస్తుంది. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని సాహసోపేతంగా ప్రయాణాలు సాగించవలసిన దయనీయ పరిస్థితులు ఆ ప్రాంత ప్రజలకు ఎదురవుతుంది. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆ ప్రాంతీయులు విమర్శలు గుప్పిస్తున్నారు దీనిలో భాగంగానే బుధవారం కొమ్మిక రైతు భరోసా కేంద్రానికి తరలిస్తున్న యూరియా లారీ గుంతల్లో కూరుకుపోయింది. దీంతో స్థానికుల సహకారంతో బయటకు తీసేందుకు నానా అగచాట్లు పడ్డారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులు సత్వరమే స్పందించి కొమ్మిక రహదారి ని కనీసం మరమతులైన చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే తమకు నిత్యం రహదారి కష్టాలే మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.