జిసిసి సీనియర్ అసిస్టెంట్ గా వీరభద్రరావుకు పదోన్నతి
జిసిసి ఎండి కల్పన కుమారి చేతుల మీదగా అందుకున్న నియామక పత్రం
నిజాయితీకి దక్కిన గౌరవం
కొయ్యూరు అల్లూరి జిల్లా
అక్టోబర్ 16 అఖండ భూమి న్యూస్
RTVNEWS (లవకుశ)గొలుగొండ మండలం కృష్ణదేవి పేట జిసిసి పెట్రోల్ బంక్ సూపర్డెంట్ గా పనిచేస్తున్న బండారు వీరభద్రరావు కు పదోన్నత లభించింది. ఈ మేరకు విశాఖపట్నంలో గురువారం జీసిసి ఎండి కల్పనా కుమారి ఐఏఎస్ చేతుల మీదుగా పదోన్నత పత్రాన్ని అందుకున్నారు. వీరభద్రరావు గతంలో కృష్ణ దేవి పేట జిసిసి సూపర్డెంట్ గా పనిచేసి, అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధిలో బీసీసీ సూపర్ గా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం వీరభద్రరావు కృష్ణా దేవి పేట జిసీసీ పెట్రోల్ బంక్ సూపర్నెంట్గా బాధ్యతలు స్వీకరించారు. వీరభద్రరావుకు జిసిసి సాహ ఉద్యోగులు పలువురు జీసిసి కలసీలు తదితరులు పదోన్నతి పొందిన వీరభద్ర రావుకు అభినందినలు తెలిపారు .ఈ సందర్భంగా వీరభద్ర మాట్లాడుతూ జీసిసిలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తే ఉద్యోగులు ఇటువంటి పదోన్నతులు పొందుతారని అన్నారు.