మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యట నను విజయవంతం చేయాలి... ఏ ఎల్ పురం ఎంపీటీసీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు "చింతల బుల్లి ప్రసాద్"

Rtv Rahul
0
జగన్మోహన్ రెడ్డి పర్యటన ను విజయవంతం చేయాలి 

ఏ ఎల్ పురం ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్ 

RTVNEWS (లవకుశ)వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న మాకవరపాలెం లో మెడికల్ కాలేజ్ ను సందర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏ ఎల్ పురం ఎంపీటీసీ, మండల వైసిపి పార్టీ ఉపాధ్యక్షుడు చింతల బుల్లి ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక విలేకరులతో బుల్లి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీ లను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అయితే మాకవరపాలెం మెడికల్ కాలేజీకి ఎటువంటి అనుమతులు లేవని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించిన నేపథ్యంలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాలని నేపథ్యంలో వస్తున్నారని అన్నారు. కావున మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
  • Newer

    మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యట నను విజయవంతం చేయాలి... ఏ ఎల్ పురం ఎంపీటీసీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు "చింతల బుల్లి ప్రసాద్"

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">