గబ్బంగి పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు. ఏపీ టూరిజం డైరెక్టర్ "కిల్లు వెంకట రమేష్ నాయుడు"

Rtv Rahul
0
గబ్బంగి పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు


ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు*



RTVNEWS( లవకుశ)రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  సుపరిపాలనలో తొలి అడుగు  కార్యక్రమం గురువారం ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు అధ్యర్యంలో గబ్బంగి పంచాయతీలో ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ నాయుడు  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో  ఇప్పటికే తల్లికి వందనం ఉచిత,దీపం పథకం,అన్నక్యాoటీన్లు,మెగా డిఎస్సి,ఎస్సి వర్గీకరణ,బీసీ సంక్షేమo, గుంటలులేని రోడ్లు,సబ్సిడీ విద్యుత్, సురక్షిత ఆంధ్రప్రదేశ్, మహిళ సంక్షేమం, పోలవరం నిర్మాణం,  రాజధాని అభివృద్ధి ఏర్పాటు వంటి ఏన్నో విజయాలు సాదించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి తెలియజేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు బోరుణ వర్షం కురుస్తున్న అధినేత ఇచ్చిన పిలుపుమేరకు  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నడంతో ప్రజలు కూడా అదే రీతిలో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మత్యరాస మణికుమారి, మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి కోడా.వెంకట సురేష్ కుమార్ ,   సీనియర్ నాయకుడు శోభ శ్రీను,యువనాయకులు తామర మూర్తిబాబు,తామర ప్రసాద్,చిట్టిబాబు  ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">