వైసిపి అధినేత జగన్ తో రాష్ట్ర యువజన విభాగం జాయింట్ కార్యదర్శి అచ్యుత్ బేటి
యువజన విభాగం నాయకులకు దిశా నిర్దేశం చేసిన జగన్మోహన్ రెడ్డి
RTVNEWS (లవకుశ)వైయస్సార్సీపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు కు వివిధ అంశాలపై వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేశారని రాష్ట్ర యువజన విభాగం జాయింట్ కార్యదర్శి అచ్యుత్ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో అచ్యుత్ మాట్లాడుతూ మంగళవారం తాడేపల్లిలో వైసిపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగం పదవి అత్యంత కీలకమని దీనిని తొలి అడుగుగా మలుచుకొని ఎమ్మెల్యేలు కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం అవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారని అచ్యుత్ పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవడం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించడం ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడం వారితో కలిసి పోరాడడం వంటివి ఈ మూడు లక్షణాలు ప్రతి ఒక్కరు లో అలవర్చుకోవాలని అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారని దిసానిర్దేశం చేసినట్లు తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని దీనికి సంబంధించి కార్యచరణ ఇప్పటినుండే మొదలు పెట్టాలని పిలుపునిచ్చారని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పార్టీ ఆవిర్భావం నుండి వైసిపి ప్రభంజనం సృష్టిస్తుందని దానిని కొనసాగింపు గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేసినట్లు అచ్యుత్ తెలిపారు