తల్లిదండ్రులు పాఠశాలలు నెలకొకసారి రావాలి
పి. మాకవరం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం" సుమ్మర్ల సంధ్య"
RTVNEWS( లవకుశ)విద్యార్థుల పట్ల తమకెంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులకు అంతే బాధ్యత కలిగి ఉండాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు విద్యార్థులు చేరుకుంటారని పి మాకవరం ప్రధానోపాధ్యాయురాలు సుమ్మర్ల సంధ్య అభిప్రాయపడ్డారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం 2.0 ను గురువారం పీ మాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. ప్రతి విద్యార్థిని వాడి తల్లిదండ్రులు వద్దకు చేర్చి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు . వారి నడవడిక ఆరోగ్యం అనే విషయాలపై కూలం కోసంగా తల్లిదండ్రులకు ఆయా క్లాస్ ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం తల్లిదండ్రుల్లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు సుమ్మర్ల సంధ్య మాట్లాడుతూ రేయింబగళ్లు విద్యార్థుల అభివృద్ధికై కృషి చేస్తున్నామని విభజించారు. విద్యార్థులు కూడా అదే రీతిలో చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పుడే చదివిన పాఠశాలకు పుట్టు పెరిగిన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకు వస్తారని విద్యార్థులకు హితబోధ చేశారు. ముఖ్యంగా పాఠశాలల్లో చదివే విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సదుద్దేశంతో ప్రభుత్వము తల్లికి వందనం పేరుతో డబ్బులను తల్లులు ఖాతాల్లో జమ చేస్తూ ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ఈ విద్యా సంవత్సరానికి 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులు దాటిన ప్రతి విద్యార్థికి 20వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను క్షుణ్ణంగా అభ్యసించి మంచి నడవడిక తో క్రమశిక్షణతో కూడిన విద్యను పొందాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు అనంతరం సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన తల్లిదండ్రులకు పాఠశాల ప్రాంగణంలోని భోజన సదుపాయం ఏర్పాటు చేశారు దీంతో పాఠశాల ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు