నాగపురంలో స్మశాన వాటిక నిర్మాణం అడ్డుకోవడం తగదు
తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు హితబోధ
RTVNEWS (లవకుశ)ఏళ్ల తరబడి దహన సంస్కారాలు జరుగుతున్న స్థలంలో స్మశాన వాటిక నిర్మాణం చేపడుతుంటే వైసీపీ సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ అడ్డుకోవడం తగదని టిడిపి జనసేన నాయకులు మాజీ సర్పంచ్ కొలగాన రామారావు, బొప్పన ప్రసాదు, రేగుబల్ల శివ, సేనాపతి వరహాలు బాబు అన్నారు. సోమవారం గొలుగొండ మండలం సిహెచ్ నాగపురంలో నిర్మిస్తున్న స్మశాన వాటిక వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి గ్రామంలో మృతి చెందిన వారి సమాధులు స్కూలుకు ఎదురుగా 20 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని. పాఠశాలకు 150 మీటర్ల దూరంలో స్మశాన వాటిక నిర్మిస్తుంటే కావాలనే రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వము అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. గత వైసిపి ప్రభుత్వం లో అదే స్మశాన వాటికకు రహదారి కల్వర్టు నిర్మించడంతోపాటు సర్పంచ్ రఘురామచంద్రరావు కు చెందిన మృతి చెందిన ఆవు అలాగే కొంతమంది బంధువులను పాఠశాల దగ్గరలోనే దహన సంస్కారాలు చేసినప్పుడు పాఠశాల ఉన్నట్లు ఆ రోజు తెలియలేదా అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వ హాయములో స్మశానాన్ని ఆనుకొని 20 మీటర్ల దూరంలో నాగపురం, కుమారపురం, గ్రామానికి చెందిన ప్రజలకు జగనన్న కాలనీ ఇవ్వడం తప్పులేదా అని ప్రశ్నించారు. స్మశాన వాటికకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తే పంచాయతీ తీర్మానం సర్పంచ్ ఇవ్వకపోవడంతో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులందరూ సంతకాలు చేసి అంగీకారం తెలిపారు అన్నారు. గ్రామంలో పూర్వపు నుండి స్మశాన వాటిక అక్కడే ఉండేదని గెడ్డను ఆనుకొని ఉన్న స్మశాన స్థలానికి సరైన రహదారి లేకపోవడంతో ప్రస్తుత ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్వం నుంచి చేసేవారిని ఈ నేపథ్యంలో స్మశాన వాటిక నిర్మాణం చేపడితే అడ్డుకోవడం దారుణమని ఎద్దేవా చేశారు. పాఠశాలకు ప్రహరీ లేనప్పుడే ఆ ప్రాంతంలోదహన సంస్కారం జరిగేవని ప్రస్తుతం పాఠశాలకు ప్రహరీ గోడ కూడా ఉందని స్మశాన వాటిక కూడా నిర్మాణానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని విద్యార్థులకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదని స్కూల్ చైర్మన్ జైతి అప్పారావు అన్నారు. ఏది ఏమైనా స్మశాన వాటికి నిర్మాణం ఎవరైనా అడ్డుకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదని అందరికీ ఆమోదయోగ్యమైన స్మశాన వాటిక నిర్మాణానికి రాజకీయ కక్షపూరితంగా, అడ్డుకోవడం సిగ్గుచేటని, అవసరమనుకుంటే అభివృద్ధికి సహకరించాలని కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులను రెచ్చగొట్టి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ సేనాపతి సత్తిబాబు, యర్రా మురళి, పోలిశెట్టి జగ్గయ్య దొర, వెంకటేశ్వరరావు , అప్పన నాగేశ్వరరావు, దుంపలపూడి వెంకటరమణ, మంతెన సూర్యనారాయణ, కలం సత్యనారాయణ, గణేష్, తదితరులు పాల్గొన్నారు