నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మన్యపురుట్లలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు, అద్దేపల్లి గణేష్
RTVNEWS( లవకుశ)ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పూర్తిస్థాయిలో అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు నర్సీపట్నం ఇన్చార్జ్ అద్దేపల్లి గణేష్ అభిప్రాయపడ్డారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. దీంతో అప్పన దొరబాబు అద్దేపల్లి గణేష్ ప్రసంగిస్తూ గ్రామంలో డ్రైనేజీ రోడ్లు సమస్య అధికంగా ఉందని వీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ, తల్లికి వందనం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బోరును వర్షం కురుస్తున్న జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వీసం చిట్టిబాబు, చిన్నారి, జనసేన నాయకులు మారిశెట్టి రాజా, కూనిశెట్టి రాజు, చక్రి, యూత్ ప్రెసిడెంట్ బైన మురళి, నాతవరం వైస్ ప్రెసిడెంట్ అశ్విన్, గుంత కృష్ణ, లంక సతీష్ సమిరెడ్డి కిరణ్, నాని, త్రినాథ్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు