నిలిచిన డ్రైనేజీ పనులు అవస్థలు పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు..

Rtv Rahul
0
నిలిసిన  డ్రేనేజి  పనులు - పాఠశాలకు 
  వెళ్ళలేక పిల్లలు టీచర్స్ అవస్థలు.


జాతీయ రహదారి నిర్మాణ సంస్థ రోడ్డు కాంట్రాక్టర్ల నిర్వహకం ..




RTV NEWS( లవకుశ)జాతీయ రహదారి నిర్మాణ సంస్థ చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గత ఏడాది లో పెద్ద మాకవరం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను అనుకుని ఎన్ హెచ్ 516హై వే రోడ్డు ను పాఠశాల గేట్ పక్కనుండే డ్రేనేజి నిర్మించారు .ఈ డ్రైనేజీ   పనులను పూర్తి చేయకపోవటంతో  పాఠశాల లోపలకు వెళ్లే మార్గంతో  పిల్లలు, ఉఫాధ్యాయులు, పలువురు తల్లితండ్రులు  దీనిని దాటి వెళ్ళలేక తీవ్ర అవస్థలు పడుతున్నట్టు తెలిపారు.ఈ పనులను  గత 4నెలలుగా పూర్తి చేయక నిలిపేశారు.హై వే కాంట్రాక్టర్ దాదాపు డ్రైన్ చాలా వరకు పూర్తి చేసి పాఠశాల గేటు కు ఎదురు భాగం వద్దనే నిర్మించకుండా డ్రైనేజీ అర్ద్దంతంగా వదిలేశారు. దీంతో డ్రైనేజీ నిర్మించాల్సిన ప్రదేశం గేట్ కు తిన్నంగా ఉండటంతో  10 అడుగుల మేరా పిల్లలు, ఉఫాధ్యాయులు నిత్యం దిగి వెళ్ళలేక నా నా అవస్థలు పడుతున్నట్టు పలువురు ఉఫాధ్యాయులు, విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4నెలలగా ఇదే పరిస్థితి ఉండగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ డ్రైనేజీ ప్రదేశ ప్రాంతంలో జారిపోవటంతో  లోపలకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. అలాగే పాఠశాలకు, విద్యార్థులకు కావలసిన సామాగ్రిని తరలించేందుకు కూడా అష్ట కష్టాలు పడుతున్నామని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు.తక్షణమే  సంబధిత హై వే కాంట్రాక్టర్ స్పందించి డ్రైనేజీ ప్రాంతంలో పిల్లలు, ఉఫాధ్యాయులు పడే ఇబ్బంది తొలగించాలని అర్దంతంగా నిలిచి ఉన్న డ్రైనేజీ ని పూర్తి చేయాలని
 వారంతా కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">