గన్నవరంలో మంచి నీటి సమస్య పరిష్కరించాలి
ఎంపీడీవో దృష్టికి తీసుకువెళ్లిన జనసేన నాయకులు "అప్పన దొరబాబు", "అద్దేపల్లి గణేష్"
RTVNEWS( లవకుశ)నాతవరం మండలం గన్నవరం గ్రామంలో తొమ్మిది నెలలుగా మంచినీటికి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇంచార్జ్ మండల అభివృద్ధి అధికారి ఉషశ్రీ దృష్టికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్ తీసుకు వెళ్లినట్లు తెలిపారు. బుధవారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో దొరబాబు గణేష్ మాట్లాడుతూ గన్నవరం గ్రామంలో 9 నెలలుగా త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయమై మండల అభివృద్ధి అధికారి ఉషశ్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రెండు మూడు రోజుల్లో గ్రామంలో పూర్తిస్థాయిలో పరిశీలించి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మారిశెట్టి రాజా సేనాపతి రమేష్ ప్రగడ చినబాబు ఎర్ర దొరబాబు తదితరులు పాల్గొన్నారు