ఇబ్బందుల్లో ఉన్నపూర్వపు విద్యార్థులకు ఆర్థిక సహాయం
మానవత్వం సాటుకున్న స్నేహితులు
RTVNEWS (లవకుశ)తమతో పాటు చదువుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్ననాటి స్నేహితులు కు ఆర్థిక సహాయం అందించి ఏ కష్టం వచ్చినా తామున్నామని పూర్వపు విద్యార్థులు మానవత్వాన్ని చాటుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో 1994 -95 సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు తమతో పాటు చదివిన పాత కృష్ణా దేవి పేట గ్రామానికి చెందిన కయ్యం శ్రీలక్ష్మి, కృష్ణ దేవి పేట గ్రామానికి చెందిన పైల అప్పలనాయుడు, అనపర్తి కి చెందిన జి.రవిబాబులు కు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మూర్తి( పోలీస్) అలివేణి మంగ, రాణి ,దేవుడమ్మ, మాట్లాడుతూ తమతో పాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకొని ఇటీవల నర్సీపట్నం వివేకనంద కళాశాలలో నిర్వహించిన పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని సంకల్పించడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే పూర్వపు స్నేహితులందరూ కలసి సేకరించిన నగదును తమ స్నేహితులకు అందజేయడం జరిగిందన్నారు. దీంతో నగదును అందుకున్న ముగ్గురు స్నేహితులు తమతో పాటు చదువుకున్న వాళ్లంతా పాఠశాల నుండి విడిపోయి 30 సంవత్సరాలు అయినా మమ్మల్ని మర్చిపోకుండా తమ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి తమకు ఆర్థిక సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.