అధికారులకు ఆదాయ వనరుగా మారిన ఆర్ అండ్ బి రోడ్డు.. ఆదివాసి జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్" మొట్టడం రాజబాబు"

Rtv Rahul
0
*అధికారులకు ఆధాయ వనరుగా ఆర్ అండ్ బి రోడ్డు:ఆదివాసీ జెఏసి*

RTVNEWS (లవకుశ)ఆర్ అండ్ బి రోడ్డుపై అక్రమనిర్మాణాల తొలగింపు  అధికారులకు ఆధాయ వనరుగా  మారిందని,అడుగుకు ఒక రేటు చొప్పున అక్రమనిర్మాణదారుల దగ్గర నుండి  భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొయ్యూరు మండల డిప్యూటీ తహశీల్దార్ జెడ్పీ గెస్ట్ హౌస్ లో కొయ్యూరు వర్తక సంఘంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతూ,రోడ్డుకు ఇరువైపులా 50,50 అడుగులు అక్రమ నిర్మాణాలను తొలిగించాలి, కానీ సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ లతో పాటు కోర్టులను కూడా మేనేజ్  చేస్తానని,50కి బదులు 15 అడుగుల వరకే అక్రమ నిర్మాణాలను తొలిగిస్తానని,అందుకు అడుగుకు ఒక రేట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది,ఒకవైపు కోర్టు ఆదేశాలతో రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలలో అక్రమ నిర్మాణాలను తొలిగిస్తుంటే, కొన్ని మండలాలలో నామమాత్రంగా అక్రమ నిర్మాణాలను తొలగించారు.కొయ్యూరు మండలంలో మాత్రం అధికారులు చేతివాటం మొదలైందని చెప్పడానికి అక్కడి ఆర్ అండ్ బి రోడ్డు అక్రమ నిర్మాణదారులతో  మండల డిప్యూటీ తహశీల్దార్,ఇతర అధికారులు గెస్ట్ హౌస్ లో ప్రత్యేక సమావేశం,రాత్రుల్లు ఇళ్లలో సమావేశం కావడం,ఆ సమావేశాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం చేయడం ఎంతవరకు నిజమో,కొయ్యూరు డిప్యూటీ తహశీల్దార్ ఇన్ ఛార్జ్ తహశీల్దార్ హోదాలో  ఇలాంటి  సమావేశాలు పెట్టడం ఎంతో నామోషీ,దీనిపైనా  జిల్లా అధికారులు పూర్తి విచారణ జరిపి భాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">