పంచాయతీ అప్రూవల్ తోనే ఇల్లు నిర్మాణాలు చేపట్టాలి
సర్పంచ్ "లోచల సుజాత"
RTVNEWS( లవకుశ)పంచాయతీలో నూతనంగా గృహ నిర్మాణాలు చేపట్టే యజమానులు పంచాయితీ ప్లాన్ అప్రూవల్ తీసుకుని నిబంధనలు ప్రకారమే గృహాలు నిర్మించుకోవాలని సర్పంచ్ లోచల సుజాత ఇన్చార్ఈవో పి ఆర్ డి కే శ్రీనివాస్ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో సర్పంచ్ సుజాత ఇంచార్జ్ ఈ ఓ ఆర్ డి కే శ్రీనివాసు మాట్లాడుతూ అకాలంగాకురుస్తున్న వర్షాలు నేపథ్యంలో గ్రామంలో అనేక వీధుల్లో డ్రైనేజీలు చెత్త పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగిందన్నారు అలాగే వివిధ ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోయి వ విష సర్పాలు వంటివి సంచరించి ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వాటిని కూడా ధ్వంసం చేయించమన్నారు. ముఖ్యంగానూతన గృహాలు నిర్మించే యజమానులు పంచాయతీ కాలువలపై ప్రహరీ గోడలు వంటివి నిర్మించినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ముందుగానే కాలువల పైకి రాకుండా ప్రహరీ గోడలో నిర్మించుకోవాలని తెలిపారు. పంచాయతీ అప్రూవల్ తీసుకోకపోయినా కాలువలపై ప్రహరీ గోడలు నిర్మించి నిబంధనలు పాటించకపోయినట్లయితే పంచాయతీ పరంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని గ్రామస్తులందరూ గమనించాలని సర్పంచ్ సుజాత ఈ సందర్భంగా కోరారు