కృష్ణ దేవి పేటలో1995 -96 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ కలయిక

Rtv Rahul
0
కృష్ణ దేవి పేటలో1995-96 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

ఆనందోత్సవాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన చిన్ననాటి స్నేహితులు 

RTVNEWS (లవకుశ)ఉపాధ్యాయులు విద్యార్థులకు పెట్టే ముట్టికాయలు, ఉపాధ్యాయులను విద్యార్థులు ఆట పట్టించే సన్నివేశాలను వెనక వరుసలో కూర్చుని అల్లరి చేసే చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను కృష్ణ దేవి పేట జడ్పీ హైస్కూల్లో 1995 96 సంవత్సరంలో చదివిన పూర్వపు విద్యార్థులు నెమరు చేసుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఆదివారం గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట హై స్కూల్లో ఏర్పాటుచేసిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనాటి స్నేహితుడు అందరూ హాజరై చిన్ననాటి తీపి గుర్తులు నెమరు వేసుకుంటూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ సందడి చేశారు. అనంతరం రోంగల శ్రీను,  తో పాటు పలువురు పూర్వపు స్నేహితులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కనువిందు అయిన కమనీయమైన సామూహిక సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ మన టెన్త్ క్లాస్ బ్యాచ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన స్నేహితుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే అందరూ ఆర్థికంగా అన్ని విధాల అండగా నిలిచి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. మన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిగిలిన పూర్వపు విద్యార్థుల వారందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. 30 ఏళ్లు గడిచిన అనంతరం అందరం చదువుకున్న పాఠశాలలో కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అందరూ సంబరపడ్డారు. ఇకపై తరచూ ఆత్మీయ కలయక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం హై స్కూల్ ప్రాంగణమంతా పూర్వపు విద్యార్థుల సందడితో కోలాహాలంగా మారింది

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">