టి ఏ సి ద్వారా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమాకాల చట్టం తేవాలి: ఆదివాసి జేఏసీ నాయకులు..

Rtv Rahul
0
గిరిజన సలహా మండలి ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి


ఆదివాసీ జెఏసి గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే" నిమ్మక జయరాజ్ "రాష్ట్ర వైస్ చైర్మన్ "మొట్టడం రాజబాబు" 



RTVNEWS( లవకుశ)గిరిజన సలహా మండలి(టిఎసి)ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజు బాబు తో పాటు నాయకులు, రాష్ట్ర  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణిని కలిసి  కోరారు.రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణిని సాలూరులో కలిసి సుప్రీంకోర్టు జిఓ 3 రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సీ  నోటిఫికేషన్ లో ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగిందని,ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరగా,గిరిజనులకు 2,024 పోస్టులు  కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పగా,ఆ పోస్టులు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసి  ఇవ్వాలని,అంతవరకు ఆ పోస్టులను ఆపాలని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలంటే వెంటనే గిరిజన సలహా మండలి (టిఎసి) ఏర్పాటు చేయాలని కోరారు.మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాలను తీసుకుని వెళతానని,గిరిజనులకు ఉద్యోగ నియామకాల్లో న్యాయం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ,ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు,ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఒక కమిటీ ఏర్పాటు చేసారని,వారు జిఓనెం 3కి ప్రత్యన్మాయం ఆలోచిస్తున్నారని,వారితో త్వరలోనే అమరావతి వేదికగా ఆదివాసీ మేధావులతో చర్చిద్దామని చెప్పారు. జిఓ నెం 275,జిఓ నెం 3 కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చారని,జిఒ నెం 3 కి ప్రత్యన్మాయం కూడా చంద్రబాబునాయుడే చూస్తారనే ఆశాభావం ఆదివాసీలలో ఉందని,ఆదివాసీల ఆశలను  మంత్రి 
సంధ్యరాణి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేర్చాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు,వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి,జిల్లా కన్వీనర్ రామారావుదొర,ఆవివాసీ ఉద్యోగులసమాఖ్య జిల్లా అధ్యక్షుడు సోంబాబు,చెల్లయ్య,మసాడ ఈశ్వరరావు,సురేష్ బాబు,నందు,సురేష్,మండలి గిరిధర్, సిపిఎం నాయకుడు అప్పలనర్స, డిఎల్ఓ నాయకుడు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
  • Newer

    టి ఏ సి ద్వారా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమాకాల చట్టం తేవాలి: ఆదివాసి జేఏసీ నాయకులు..

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">