వేసవిలో త్రాగునీటికి అధిక ప్రాధాన్యత
ఏ ఎల్ పురం సర్పంచ్ "లోచల సుజాత"
RTVNEWS (లవకుశ)గొలుగొండ. మండలం మేజర్ పంచాయతీ ఎఎల్ పురం గ్రామంలో వేసవి దృశ్య మంచినీటి సమస్యపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని సర్పంచ్ లోచల సుజాత తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ఏ ఎల్ పురం గ్రామంలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు ఏడు మంచినీటి ట్యాంకులు ఉన్నాయని అందులో మూడు ట్యాంకులకు సమీపంలో గల లింగంపేట నుండి వచ్చే వాటర్ స్కీం ద్వారా పనిచేస్తున్నాయన్నారు అయితే అవి తరచు మరమత్తులకు గురి కావడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా మిగిలిన నాలుగు వాటర్ ట్యాంకులు సక్రమంగా పనిచేస్తున్నాయని వాటిలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే విను వెంటనే మరమ్మత్తులు చేపిస్తున్నామని తెలిపారు అలాగే అవసరమైతే కొత్త మోటర్లు బిగించుచున్నామని గతంలో జేజేఎం ద్వారా పైప్ లైన్స్ టాప్స్ బిగించాలని కానీ వాటికి కొన్నిచోట్ల కలెక్షన్ ఇవ్వలేదని వాటిని కూడా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ సుజాత తెలియజేశారు