నేడు కుమ్మరి పుట్టులో టిడిపి అత్యవసర సమావేశం
టిడిపి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి "తోటా దొరబాబు"
RTV NEWS (లవకుశ)తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం అత్యవసర సమావేశం ఈనెల 28న కుమ్మరి పుట్టులో నిర్వహించనున్నట్లు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కార్యాలయం ప్రకటన విడుదల చేసిందని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గిడ్డి ఈశ్వరి ఇంటిదగ్గర (కుమ్మరపుట్టు) నిర్వహించే అత్యవసర సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంటు నాయకులు నియోజకవర్గ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జులు పూర్తి ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జిలు బూత్ కమిటీలు మాజీ జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు మాజీ సర్పంచులు గ్రామ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దొరబాబు ఈ సందర్భంగా తెలియజేశారు