గిరిజన ప్రాంతంలో మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏపీ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి "కూడా రాధాకృష్ణ"

Rtv Rahul
0
మెగా డీఎస్సీతోపాటు ఆదివాసి స్పెషల్ డీఎస్సీనోటిఫికేషన్ విడుదల చేయాలి


 రేపు జరుగుతున్న ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో  చర్చించి, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి

 ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్ 

 RTVNEWS( లవకుశ)గిరిజన ప్రాంతంలో మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఆదివారం ఈ సందర్భంగా మాట్లాడుతూజీవో నెంబర్ 3 సుప్రీం కోర్ట్  కొట్టివేయడంతో  ఆదివాసి ప్రాంతంలో ప్రభుత్వ అన్ని శాఖలలో   ఉద్యోగ  నియామకాలు ఆదివాసేతరులతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఆదివాసి నిరుద్యోగులకు  ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత అంతా మైదాన ప్రాంత కంపెనీల, చేపల చెరువుల పనిచేసేందుకు వలస బాట పడుతున్నారని, అదేవిధంగా మైదాన ప్రాంతం వాళ్లతో పోటీపడే చదువుకోవాలన్న ఆదివాసులకు ఆర్థిక భారంతో కోచింగ్ సెంటర్ లో చదువుకోలేని పరిస్థితి గాడ్ పడిందన్నారు. జీవో నెంబర్ 3పై సీఎం నారా చంద్రబాబు నాయుడు  అరకు సభలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకొని ఆదివాసి ప్రాంతంలో మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి ప్రాంత స్పెషల్  డీఎస్సీ పై రేపు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో  చర్చించి, తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్  విడుదల చేసిన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఆదివాసి ప్రాంత నిరుద్యోగులతో ఆందోళన చేయవలసి వస్తుందని వారు హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">