గ్రంథాలయ వారోత్సవాల్లో చోద్యం విద్యార్థులు
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు
RTVNEWS( లవకుశ)గొలుగొండ మేజర్ న్యూస్. గొలుగొండ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా 57వ జాతీయవారోత్సవాల్లో చోద్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. గ్రంధాలయం ఆధ్వర్యంలో నిర్వహించే క్విజ్, రంగవల్లిక, పోటీల్లో చోద్యం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలుపొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ పి సత్తిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు కుందూరు నూకరాజు, ఉపాధ్యాయులు సిహెచ్ వి రమణ, వరప్రసాద్, వాసు, బోధన, బోధన సిబ్బంది గ్రామ పెద్దలు అభినందించారు