చింతలపూడిలో పూరి గుడిసె దగ్ధం మూడు లక్షలు రూపాయలు ఆస్తి నష్టం

Rtv Rahul
0
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. మూడు లక్షల వరకు ఆస్నష్టం 

RTVNEWS( లవకుశ)కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పుట్టా సత్యనారాయణకు చెందిన పూరిగుడిసె దగ్ధం కావడంతో సుమారు మూడు లక్షల రూపాయల వరకు నష్టం వాటిలిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పంటపొలాల్లోకి వెళ్లడంతో పూరి గుడిసె లో ఉన్న విద్యుత్తు మీటర్ నుండి మంటలు వ్యాపించి పూరి గుడిసె అగ్నికి ఆహుతి అయిందని స్థానికులు తెలిపారు దీంతో ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రితో పాటు బంగారం, నగదు కూడా దగ్ధమైంది అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో బాధితులకు కట్టు బట్టల తప్ప సర్వసం కాలి బూడిద అయ్యాయన తెలిపారు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించిన వీలు కాకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనపై అధికారులు, ప్రభుత్వమను తమను ఆర్థికంగా ఆదుకోవాలని అగ్ని బాధితులు పుట్టా సత్యనారాయణ వేడుకుంటున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">