నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
గొలుగొండ వైఎస్ఆర్సిపి వైస్ ఎంపీపీ జక్కు నాగమణి ,
RTVNEWS (లవకుశ)నర్సీపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పుట్టినరోజు వేడుకలును పుష్కరించుకొని గొలుగొండ మండల వైస్ ఎంపీపీ జక్కు నాగమణి మాజీ ఎమ్మెల్యే ను పార్టీ కార్యాలయంలో బుధవారంకలసిశుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గొలుగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ జక్కు నాగమణి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా తమ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని అని అమె అన్నారు. రాజకీయంగా వైసిపి పార్టీని నర్సీపట్నం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపేట సర్పంచ్ పోలిరెడ్డి రాజబాబు నాగపురం సర్పంచ్ ఎలమంచిలి రఘురామచంద్రరావు సర్పంచ్ కసిపెల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు