అగ్ని బాధితులకు ఆర్థిక సహాయం అందించిన శ్యామల వరలక్ష్మి
బట్టలు నిత్యవసర సరుకులు పంపిణీ
RTV NEWS (లవకుశ)షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసె అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన బాధితులకు జాతీయఅల్లూరి సీతారామరాజు యువజన సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల వరలక్ష్మి టిడిపి నాయకులు కొర్రు రామ్మూర్తి నిత్యవసర సరుకులతో పాటు బట్టలు , నగదు ఆర్థిక సహాయం అందించారు. మండలంలో చింతలపూడి గ్రామంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిగుడిసె దగ్ధమై ఇంట్లో వస్తువులతో పాటు సర్వసం కాలిపోయిన పుట్టా సత్యనారాయణ దంపతులకు గురువారం శ్యామల వరలక్ష్మి నిత్యవసర సరుకులు బట్టలు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్గిరమై కట్టుబట్టల తప్ప ఏమీ మిగిలి లేదని ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహృదయంతో ఆదుకోవాలని వరలక్ష్మికోరారు