జనసేన పార్టీ కి గుర్తింపు తెచ్చిన నేతకు ఇలాంటి నామినేటెడ్ పదవ!
జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గూడెం లక్ష్మణ్, బూత్ కమిటీ కన్వీనర్ సాగిన బుజ్జి బాబు
RTVNEWS (లవకుశ)పాడేరు ఐటిడిఏ పరిధిలో గల గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ప్రజల్లోకి తీసుకు వెళ్లిన పాడేరు, అరకు పార్లమెంటు ఇన్చార్జ్ డాక్టర్ ఒంపూరు గంగులయ్య కు నామినేటెడ్ పదవి కేటాయింపుల్లో స్థాయికి తగ్గ పదవి కేటాయించకుండా అవమానించారని మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గూడెం లక్ష్మణ్ బూత్ కమిటీ చైర్మన్ సాగిన బుచ్చిబాబు అన్నారు. బుధవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో జనసేన పార్టీ ని ప్రజలతో మమేకమవుతూ యువ నాయకులను తయారు చేస్తూ అభిమానులను కార్యకర్తలుగా మారుస్తూ గ్రామ గ్రామాలనే జనసేనలో చేరుస్తూ ఉత్సాహవంతమైన కార్యక్రమాలు ఎన్నో చేసి నా నాయకుడిని కూటమి ప్రభుత్వంలో ఏపీ కోపరేటివ్ డైరెక్టర్ పదవి ఇచ్చి అవమానించారని వారు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి పదవులు లేకుండానే జనసేన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి జనసేన ముఖ్యనేతగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి గంగులయ్యకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా గెలుపు కోసం ఎనలేని కృషి చేశారన్నారు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నామినేటెడ్ పోస్టుల కోసం గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ తరపు నుండి ఎంతో కృషిచేసిన బంపూరి గంగులయ్యకు ఉన్నతమైన పదవి ఇచ్చి సత్కరిస్తాలనుకుంటే మండల స్థాయి లేక జిల్లాస్థాయి నాయకులు ఇవ్వాల్సినటువంటి ఏపీ కోఆపరేటివ్ మెంబర్ పదవి 11 మండలాల్లో జనసేన పార్టీ నుండి బలోపేతం చేసిన వ్యక్తికి ఇలాంటి పదవి ఇచ్చి అగౌరవ పరచడం ఏమిటని ప్రశ్నించారు జనసేన పార్టీ కార్యకర్తలకు క్రియేసేన సభ్యులకు వీర మహిళలకు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిందని వారు అన్నారు ఈ పదవిపై వెంటనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఉన్నత పదవి అప్పగించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన మహిళా అధ్యక్షురాలు సిగ్గే భావన జయంతి సీనియర్ నాయకులు గూడుపు శేషు బాబు డేటా సుధీర్ రాఘవ రాజు సిహెచ్ సిద్దు జొర్రా ప్రకాష్ పొట్టిక రాంప్రసాద్ పుర్ర రాజేష్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు