నడింపాలెంలో జల జీవన్ మిషన్ పనులు ప్రారంభం
సూపర్ సర్పంచ్ పనసల రాము
RTVNEWS.(లవకుశ)ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే సదుద్దేశంతో కేంద్ర,రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తుందని నడింపాలెం సూపర్ సర్పంచ్ పనసల రాము అన్నారు. మండలంలో నడింపాలెం గ్రామంలో శుక్రవారం జల జీవన్ పథకం ద్వారా చేపట్టే మంచినీటి పైపులైను పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సూపర్ సర్పంచ్ పనసల రాము మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ జలజీవన్ పథకం ద్వారా మంచినీటి పైపులైను వేసి సురక్షితమైన నీటిని ప్రజలకు అందివ్వడం జరుగుతుందని ఆయన అన్నారు దీని ద్వారా ప్రజలు కలుషితమైన నీటిని సేవించకుండా ఉండి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా అధ్యక్షురాలు గాం రమాదేవి, గాం చిన్నబ్బాయి, జి రాజు ఎస్ సింహాచలం జి బోడుదోర, ఎం కృష్ణ ఎం బాలరాజు జి వెంకటేష్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు