సమాచార హక్కు చట్టం 2025 వార్షికోత్సవంలో అధికారులకు సన్మానం
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కమిటీ
RTVNEWS (లవకుశ)సమాచార హక్కు చట్టం 2025 వార్షికోత్సవంలో భాగంగా ప్రజాసంకల్ప వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు సన్మానాలు చేయడం జరిగిందని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కార్యదర్శి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తాసిల్దార్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ పి రామారావు, ఏపీఎం కరుణానిధి, ఎంపీడీవో మేరీ రోజ్ లను సన్మానించారు ఈ సందర్భంగా ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర కార్యదర్శి జక్కు నరసింహమూర్తి మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం ఏర్పడి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. చట్టం అమలులో అధికారులు ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నారని ప్రజలు మనలు పొందుతూ సేవలు అందిస్తున్నారని అభినందనలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుల్లా వీరబాబు, పి రాజా, ఉల్లి తలుపులు, తాతారాము, ఎస్ రాము, బాబ్జి తదితరులు పాల్గొన్నారు