ముఖ్యమంత్రి సోదరులు నారా రామ్మూర్తి నాయుడుకి ఘన నివాళి
టిడిపి మండల ప్రధాన కార్యదర్శి "తోటా దొరబాబు"
RTV NEWS (లవకుశ):తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుక మృతి పట్ల టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రమైన కొయ్యూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు 1994 -99 మధ్య కాలంలో చంద్రగిరి నియోజవర్గం నుండి ఎమ్మెల్యే గెలుపు పొందాలని అన్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారని తెలిపారు. మేరకు నారా రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ కునిశెట్టి చంద్రరావు, మేడిపోయిన సత్తిబాబు వాసం రాంబాబు పాడి వెంకటేశ్వర్లు టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు