అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేయాలి
ఈ నెల 22న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి "ఇరవాడ దేముడు"
RTVNEWS.(లవకుశ)అర్హులైన లబ్ధిదారులు అందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంజూరు చేయాలని ఈ నెల 22న తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు అన్నారు. ఆదివారం కృష్ణ దేవి పేట అల్లూరి పార్క్ లో కొయ్యూరు మండల కార్యవర్గ సమావేశం కామ్రేడ్ వియ్యపు నానాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఇరవాడ దేవుడు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాల తో పాటు ఇల్లు మంజూరు చేసి నూతన ఇల్లుకు 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చేపట్టే నిరసన లో మండలంలో అర్హులైన లబ్ధిదారులందరూ తమ వ్యక్తిగతంగా అర్జీలను తీసుకొని మండల కార్యాలయానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వంతల లక్ష్మి జిల్లా మహిళా సమైక్య సహాయ కార్యదర్శి రావాణాపల్లి ఎంపీటీసీ ఇరవాడ సత్యవేణి, మండల మహిళా సమైక్య కార్యదర్శి సోదరుల వరలక్ష్మి గిరిజన సమైక్య అధ్యక్షుడు దర్శి సతీష్, గిరిజన సమైక్య మండల కార్యదర్శి పోట్టుకూరి దారమల్లేష్, మండల కార్యవర్గ సభ్యులు ఎం వివి సత్యనారాయణ మాజీ సర్పంచ్ గుమ్మ రాంబాబు నేలపు నాయుడు అల్లం అప్పారావు ధోని వరహాలు తదితరులు పాల్గొన్నారు