అర్హులైన హౌసింగ్ లబ్ధిదారులకి 5 లక్షలు మంజూరు చేయాలి. అల్లూరిజిల్లా సిపిఐ కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ.

Rtv Rahul
0
హౌసింగ్ లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ


RTVNEWS (లవకుశ)అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహ రుణాలు ఐదు లక్షల రూపాయలు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరి జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కొయ్యూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తాసిల్దార్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో కాకి లెక్కలు చూపించి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని ప్రకటనలు చేశారు తప్పితే వాస్తవంగా లబ్ధిదారులకు అభిచార లేదన్నారు. అలాగే లబ్ధిదారులకు కొన్నిచోట్ల ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎటువంటి సౌకర్యాలు లేక నిరుపియోగంగా దర్శనమిస్తున్నాయని తెలిపారు అలాగే మరికొన్ని చోట్ల గృహ లబ్ధిదారులకు మంజూరు చేసిన రుణాలు సరిపోకపోవడం పెరిగిన ధరలు కారణంగా ఇల్లు మధ్యలోనే నిలిచిపోయా అన్నారు. దీంతో పేదవారు కలల కన్నా సొంత ఇంటి కలగానే మిగిలిపోయాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అయితే రాష్ట్ర కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల స్వాగతిస్తున్నామని తెలిపారు అయితే గృహ లబ్ధిదారులందరికీ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివలంక కొండలరావు సిపిఐ పార్టీ మాజీ మండల కార్యదర్శి గండేపల్లి నూకరాజు, రైతు సంఘం నాయకులు వియ్యపు నానాజీ, గిరిజన సమైక్య అల్లూరి జిల్లా అధ్యక్షులు దరిశి సతీష్ మాజీ సర్పంచ్ గుమ్మా రాంబాబు గిరిజన సమైక్య మహిళా అధ్యక్షురాలు కే లక్ష్మి సుర్ల వెంకటేశు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">