16 కేజీల గంజాయితో ఓ వ్యక్తి అరెస్టు. స్కూటీ స్వాధీనం
కృష్ణదేవపేట ఎస్సై వై తారకేశ్వరరావు
RTVNEWS ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ దేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించిన ఎస్సై అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత కృష్ణ దేవి పేట బంగారంపేట రహదారి గ్రామ శివారులో వాహనాలును తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామానికి చెందిన కాగిత యశ్వంత్ స్కూటీపై వస్తుండగా తనిఖీలు నిర్వహించడంతో 16 కేజీల గంజాయి పట్టుబడిందని తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి స్కూటీని ,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై తెలిపారు