నర్సీపట్నంలో జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు
ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
RTVNEWS.జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సుమారు 200 మంది ఇన్ పేషెంట్లకు శనివారం జర్నలిస్టులు పండ్లు పంపిణీ చేశారు. నర్సీపట్నం డి.ఎస్.పి మోహన్ రావు, టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సిఐ రేవతమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులకు పత్రికాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు స్వామి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బాబ్జి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎడి బాబు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా సెక్రటరీ శ్రీనివాస వర్మ, శివ సత్యనారాయణ, నాగేశ్వరరావు (నాగు) వైశాకి రామకృష్ణ, ప్రెస్ క్లబ్ మాజీ సెక్రెటరీ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.