చిట్టెంపాడు, రామన్నపాలెంలో బిజెపి పార్టీ స్వచ్ఛభారత్ కార్యక్రమం. మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు "సంపరి శివకుమార్"

Rtv Rahul
0
చిట్టెంపాడు రామన్నపాలెంలో బిజెపి స్వచ్ఛభారత్ కార్యక్రమం


RTVNEWS (లవకుశ)సేవా పక్షోత్సవాల్లో భాగంగా మండలంలో చిట్టెంపాడు పంచాయతీలో బిజెపి మండల అధ్యక్షులు సంపరి శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం సేవా పక్షోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమాన్ని మండలంలో బిజెపి నేతలు వివిధ గ్రామాల్లో చేపట్టారు. మండల అధ్యక్షుడు సంపర శివకుమార్ ఆధ్వర్యంలో చిట్టెంపాడు పంచాయతీ చిట్టెంపాడు రామన్నపాలెం గ్రామాల్లో త్రాగునీటి బోర్లు, కొళాయిలు, పాఠశాల ప్రాంగణంలో చెత్తాచెదారాన్ని తొలగించి స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తోనే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతోనే సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పదాధికారులు మల్లేష్, చిన్నిరాజు తదితరులతో పాటు పలువురు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.
  • Newer

    చిట్టెంపాడు, రామన్నపాలెంలో బిజెపి పార్టీ స్వచ్ఛభారత్ కార్యక్రమం. మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు "సంపరి శివకుమార్"

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">