కృష్ణ దేవి పేటలో అటవీశాఖ అమరవీరుల సంస్కరణ సభ.

Rtv Rahul
0
పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలి

కృష్ణ దేవి పేట అటవీ శాఖ రేంజ్ అధికారి కే శ్రీనివాసరావు

RTVNEWS (లవకుశ)అటవీ సంపద పరిరక్షణలో ఎందరో అటవీ శాఖ అధికారులు ,సిబ్బంది ప్రాణ త్యాగం చేయడంతోనే అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కృష్ణదేవిపేట అటవీ శాఖ రేంజ్ అధికారి కే శ్రీనివాసరావు అన్నారు. గురువారం కృష్ణదేవపేట రేంజ్ కార్యాలయం ఆవరణలో అమరులైన ఫారెస్ట్ సిబ్బంది చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి కే శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవి సంపద ను కాపాడేందుకు అటవీశాఖ సిబ్బంది కలసికట్టుగా వెళ్లాలని సూచించారు . అమరవీరుల ప్రాణ త్యాగాలతోనే అటవీ సంపద కనుమరుగు కాకుండా ప్రకృతి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అడవులను  పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రేంజర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ. సెక్షన్ అధికారి వెంకటరమణ. గార్డులు సత్యనారాయణ, వాచర్లు గణపతి, రాణి, బేస్ క్యాంప్ సిబ్బంది మధు, తదితరులు పాల్గొన్నారు
  • Newer

    కృష్ణ దేవి పేటలో అటవీశాఖ అమరవీరుల సంస్కరణ సభ.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">