ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైయస్సార్
వైసిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత
RTVNEWS( లవకుశ)ప్రజల గుండెల్లో నిరంతరం స్థిరస్థాయిగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మేజర్ పంచాయతీ ఏఎల్ పురం సర్పంచ్ లోచల సుజాత అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లోచల సుజాత మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రజానీకానికి రాష్ట్రానికి చేసిన మేలును ప్రజలందరూ ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేనిదని ఆమె అన్నారు. పేద ప్రజానీకానికి అందించిన సంక్షేమ పథకాలతో అనేకమంది నిరుపేదలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైయస్సార్ బాటలోనే పైనించి సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో జగన్మోహన్ రెడ్డి అందించారని తెలిపారు. వారు చేసినసంక్షేమము అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ కావాలంటే వైఎస్సార్ పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో తిరిగి వైసిపి పార్టీని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త బుజ స్కందాలపై ఉందని ఆమె అభిప్రాయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎల్ పురం ఎంపీటీసీ లు చింతల బుల్లి ప్రసాద్ మామిడి కృష్ణ, సీనియర్ నాయకులు మురళీకృష్ణ ఉపసర్పంచ్ కుండల పెదబాబులు బీసీ సెల్ ఉపాధ్యక్షుడు సుర్ల అవినాష్ కాళ్ల శ్రీదేవి యూత్ అధ్యక్షుడు రమేషు సీనియర్ నాయకులు పెదపూడి శివ సత్యనారాయణ మారేడుపూడి రాజబాబు తామరపల్లి శివ కల్లూరు రాజబాబు కాళ్ళ లక్ష్మణ్ మధ్య సత్యనారాయణ వైసీపీ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు