No title

Rtv Rahul
0
కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళు 

32 లక్షలతో పంచాయతీ భవనానికి శంకుస్థాపన 

టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాజీ జిసిసి చైర్మన్ ఎం వి వి ప్రసాద్ 

కొయ్యూరు అల్లూరి జిల్లా 
సెప్టెంబర్ 14 అఖండ భూమిని


RTVNEWS (లవకుశ)కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జిసిసి చైర్మన్ ఎం వివి ప్రసాద్ అన్నారు. ఆదివారం చింతలపూడి గ్రామంలో నూతనంగా 32 లక్షలు రూపాయలతో నిర్మించే పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తోపాటు అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చేసేందుకు మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మించడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి కొర్రురామ్మూర్తి, పంచాయతీ కమిటీ అధ్యక్షుడు పుల్లయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు బొంకుల గడ్డయ్య యూనిట్ ఇంచార్జ్ పుట్టుకూరి సన్యాసిరావు మాజీ ఎంపీటీసీ కిలే బాలరాజు ధూపం శ్రీను భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శిఉల్లి సూరిబాబు ధన్యంరాజు కనకరాజు కే భాస్కరరావు డి మహేష్ ఎం కృష్ణ ఎస్ సన్యాసిరావు టి సంజీవ్ రావు ఎస్ మురళి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">