కొయ్యూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం
పిహెచ్సిలో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ
ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధిలో గల కొయ్యూరు మండలంలో ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు దొరబాబు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్దదైన ఐజేయు అనుబంధ సంఘమైన ఏపీయూడబ్ల్యూజే వేలాది మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద ట్రేడ్ యూనియన్ గా రూపొందింది అన్నారు. కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభమైన యూనియన్ నేడు వేలాదిమంది సభ్యులతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై నిరంతరం కృషి చేస్తూ 69 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ముప్పిడి దొరబాబు, కొప్పన సత్యనారాయణ, నరుకుల సత్తిబాబు, జొన్నాడ సత్యనారాయణ, వి వరసూర్య తదితర పలువురు పాల్గొన్నారు.