మత్తు పదార్థాలు జోలికి పోవద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఎస్ ఐలు. వై. తారకేశ్వరరావు, పి రామారావు.
. యువత మత్తు పదార్థాలు వంటి జోలికి పోయి బంగారు జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవద్దని కృష్ణ దేవి పేట ఎస్సై వై తారకేశ్వరరావు గొలుగొండ ఎస్సై పి రామారావు విద్యార్థులకు సూచించారు. సోమవారం కృష్ణ దేవి పేట జూనియర్ కళాశాల, గొలుగొండ అంబేద్కర్ గురుకుల బాలుర కళాశాల లోను జిల్లా ఎస్పీ తుహీం సిన్హా ఆదేశాల మేరకు సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్ఐలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించివారు మాట్లాడుతూ యువత చదువుకునే దశలోనే పై స్థాయికి చేరుకునేందుకు బంగారు బాటలు వేసుకొని ముందుకు సాగాలని అన్నారు. అంతేకానీ మత్తు పదార్థాలు అయినా గంజాయి, డ్రగ్స్ వంటి జోలికి పోయి జీవితాలను నాశనం చేసుకొని తల్లిదండ్రులకు భారం కాకూడదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణదేవి పేట కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీహరి అదనపు ప్రిన్సిపల్ రుత్తల గంగరాజు గొలుగొండ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.