తెలంగాణ పోలీస్‌కు కేంద్ర పురస్కారాలు

Rtv Rahul
0


 ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్‌’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్‌ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలు, ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌), అసోం రైఫిల్స్‌తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">